ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ నూతనంగా నాలుగు బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మేరకు బస్సును ఎమ్మెల్యే డాక్టర్ “బీవీ జయనాగేశ్వర్ రెడ్డి” నడిపారు._ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక బస్సు గానీ, ట్రైన్ గాని తెచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ ను నా తండ్రి మాజీ మంత్రి బీవీ. మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
