యస్ సొసైటీ సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మి పురం మండలం నెల్లికెక్కువ గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మొత్తం 60 మందికి కంటి తనిఖీలు నిర్వహించగా ఇందులో 26 మందిని శస్త్ర చికిత్స నిమిత్తం విజయనగరం తీసుకుని వెళ్ళటం జరిగింది వీరికి శస్త్ర చికిత్స పూర్తి చేసి తగిన మందులు కళ్లద్దాలు ఉచితంగా ఇచ్చి మూడు రోజుల తర్వాత తిరిగి స్వస్థలాలకు తెచ్చి దిగబెట్టటం జరుగుతుందని పుష్ప గిరి CSR హడ్ ఆనంద్ చిన్న కరణ్ అన్నారు.
తరువాత కూడా ఫాలో అప్. ట్రీట్మెంట్ కూడా నిర్వహిస్తామని అన్నారు ఇక్కడ కంటి వైద్య శిబిరం ఏర్పాటుకు సహకరించిన యస్ సొసైటీ వారికి స్థానిక నెల్లి కిక్కవ పంచాయితీ సర్పంచ్ సోములు, స్థానిక యువజన సంఘం సభ్యులు పువ్వుల అన్ని బాబు, సోమరావు, శంకర్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాబోవు రోజులలో మారుమూల గిరిజన గ్రామాల్లో మరిన్ని శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యస్ సొసైటీ కార్యదర్శి షేక్ గౌస్ పుష్పగిరి ఆసుపత్రి మేనేజర్ రమాదేవి బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ భీమ శంకర్, వైద్యులు గాయత్రి ,పూజిత మరియు సిబ్బంది పాల్గొన్నారు.