నర్సంపేట పట్టణంలోని 22వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్లు మురికి కాలువలు కల్వర్టులు నూతన నిర్మాణం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు నాలుగున్నర కోట్ల నిధులు,టియుఎఫ్ఐడిసి నిధులు 25 కోట్లు వేచ్చించి పట్టణమంతా సుందరీకరణ చేస్తున్నామని పనులు త్వరితగతి న పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
గత ఐదు సంవత్సరాలలో నిధుల కోరుతతో అభివృద్ధి జరగలేదని పట్టణంలో మురికి కాలువలు,రోడ్లు శిథిలమైపోయాయని ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు మురికినీరు ఎక్కడికి అక్కడ పేరుకుపోయి పట్టణం లో దుర్గంధంతో మునిగిపోయిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో పట్టణంలో రోడ్లు గాని డ్రైనేజీలు గాని శుభ్రంగా ఉంటాయని శుద్ధి చేసిన మంచినీటిని నిత్యం ప్రజలకు అందించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు.
ఈ సందర్భంగా 15,4, 6,8 ,9 ,18 ,19, 20,24 డివిజన్లలో శంకుస్థాపనలు చేసి వీటితోపాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో 6వ డివిజన్లో పాఠశాల భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్,మార్కెట్ కమిటీ చైర్మన్, కౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
