అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రం గంగవరంలో
పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా గంగవరం గ్రామపంచాయతీ లో సీసీ రోడ్లు,పశువుల షెడ్లు కు సర్పంచ్ అక్కమ్మ గl చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలో మరుగున పడ్డ గిరిజన గ్రామాలు గత ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగళి అన్న రీతిలో ఉన్నాయని , ఇప్పుడు తెలుగు దేశం. ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామాల అభివృద్ధి కోసం రహదారులు వీధి రోడ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం హర్షనీయమని ఆమె అన్నారు.
తమ పంచాయతీలో సిమెంటు రోడ్లను మంజూరు చేసినందుకు ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సిద్దేశ్వరరావు , , వైస్ ఎంపిపి గంగాదేవి , మండల జనసేన అధ్యక్షులు కే సిద్దు , వెంకటేశ్వరరావు ,కూటమి నాయకులు బుల్లియమ్మ, చిన్నారావు, గవర్ రాజు, మాజీ ఎంపిపి తీగల ప్రభ ,, పంచాయతీ సెక్రటరీ కృష్ణ MGNREGS సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..