కోవూరు మండలంలోని పోతిరెడ్డి పాలెం సాలుచింతలు వద్ద సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎనర్జీ ఎస్ నిధులతో 8.50 లక్షల రూపాయల నిధులు కేటాయించి సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడచిన సంక్రాంతి సమయంలో గుంతలు లేని రోడ్లను నిర్మించాలన్న ఆదేశాలతో ఈ పథకం ప్రారంభమవుతోందన్నారు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, కోవూరు నియోజకవర్గంలో 180 ఎన్ఆర్‌జీఎస్ రోడ్ల నిర్మాణానికి 12.50 కోట్లు మంజూరయ్యాయని ప్రకటించారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని అన్ని రోడ్లను బాగు చేయడం ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించమని తెలిపారు.
గత ప్రభుత్వ విధానాలతో ఖజానా ఖాళీ అయినా ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్లిపోతుందని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు నిధులు అందించడానికి కృషి చేస్తున్నారని అన్నారు.
కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల బకాయిల పరిష్కారానికి సంబంధించి, ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కారం తీసుకురావాలని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఆమె మాట్లాడుతూ, ఈ సమస్యను త్వరలోనే పూర్తి పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.