ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో పల్లెటూళ్ళు ప్రగతి బాట పట్టనున్నాయనని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ పల్లె పండుగ కార్యక్రమం. కోవూరు మండల కేంద్రంలోని కోవూరు పంచాయతీ నందు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల 55 లక్షల అంచనా విలువతో అంతర్గత సిమెంట్ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు, ఈ సందర్భంగా మండలం లోని వివిధ గ్రామాలలో జరగనున్న అభివృద్ధి పనులకు కోటి 18 లక్షలు నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు నిధుల మంజూరయ్యాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయమ్మ, తహసిల్దార్ నిర్మలనంద బాబా, ఎంపీడీవో శ్రీహరి రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి ,గాదిరాజ అశోక్ కుమార్, జెట్టి రాజగోపాల్ రెడ్డి, తదితర టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు.
పల్లె పండుగలో 55 లక్షల సిమెంట్ రోడ్ల శంకుస్థాపన
