తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లల విద్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల సభలో పిలుపునిచ్చారు. పిల్లలు చదువులో అభివృద్ధి సాధించాలంటే తల్లిదండ్రులు వారికి శ్రద్ధగా తోడ్పడాలని సూచించారు. విద్యార్థుల హాజరు, ప్రవర్తనపై తల్లిదండ్రులకు స్పష్టమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు.
మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించినట్టు తెలిపారు. విద్యార్థులు ఒక రోజైనా స్కూలుకు రాకపోతే తల్లిదండ్రుల ఫోన్‌కు సందేశం వెళ్లే విధానాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. ఈ చర్య వల్ల పిల్లల హాజరుపై తల్లిదండ్రుల దృష్టి మరింతగా ఉంటుంది.
తల్లిదండ్రులు చిన్న వయసులోనే పిల్లలకు అధికంగా సెల్ ఫోన్లు అందించవద్దని చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. అవి విద్యార్థులకు తప్పుడు ఆలోచనలకి దారితీసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. విద్యకు సంబంధించిన ప్రతి అంశంలో తల్లిదండ్రులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం విద్యావ్యవస్థలో సరికొత్త విధానాలను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.