విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ పరిధిలోని కాశ్మీర్ జలకన్య ఆవరణలో ఎగ్జిబిషన్ నిర్వహణ జరుగుతుండగా అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి ఫైర్ ఇంజన్ సిబ్బంది చేరుకునేలోపు, జనసేన నాయకుడు తిరుపతి సురేష్ తన సహచరులతో సహాయ చర్యల్లో పాల్గొన్నారు.
స్థానిక జనసేన నాయకులు తిరుపతి సురేష్, అతని మిత్రబృందం, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో కలిసి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. గంటసేపు తీవ్రంగా కృషి చేసి మంటలు అదుపులోకి తెచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం ఊరట కలిగించింది. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ, ఫైర్ ఇంజన్ సిబ్బంది, జనసేన కార్యకర్తల సమయస్ఫూర్తి కారణంగా ప్రమాదం మరింత పెరగలేదు. జనసేన నాయకుడు తిరుపతి సురేష్ స్పందన స్థానిక ప్రజల మన్ననలు పొందింది.
ఈ సహాయక చర్యలపై స్థానికులు, వ్యాపారస్తులు, అధికారులు తిరుపతి సురేష్ మరియు మిత్రబృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది కూడా తమ సేవలను సమర్థవంతంగా అందించారు. సంఘటన అనంతరం, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.