పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం మండెంఖల్ జిసిసి గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించి, నరమామిడి చెక్క పిక్కలు, చింతపండు, బియ్యం వంటి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న జిసిసి డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
సమీప గ్రామస్థులు గుమ్మలక్ష్మిపురం ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించగా, అగ్ని మాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదంలో ఎక్కువ మొత్తంలో నష్టం వాటిల్లింది.
డివిజనల్ మేనేజర్ వి. మహేంద్ర కుమార్ ప్రకారం, అగ్ని ప్రమాదంలో దాదాపు 5000 క్వింటాల నల్ల జీడి పిక్కలు దగ్ధమవడంతో సుమారు 15 లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలిపారు.