ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎక్సైజ్ పోలీస్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. మొత్తం 179 ఓట్లు ఉండగా, 176 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఓట్ల లెక్కింపు చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది.
కృష్ణయ్య 88 ఓట్లు, శ్రీనయ్య 88 ఓట్లు సాధించడంతో ఎన్నికల అధికారి శీను బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అధ్యక్ష పదవిని సమంగా పంచాలని నిర్ణయించారు. మొదటి 15 నెలలు కృష్ణయ్య, మిగతా 15 నెలలు శ్రీనయ్య బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి శీను బాబు నూతన అధ్యక్షులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ, సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, సంఘ బలాన్ని పెంచేందుకు పాటుపడతామని తెలిపారు.
ఈ ఎన్నికల ఫలితాలు అసోసియేషన్ సభ్యుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రెండు సమాన ఓట్లతో ముగిసిన ఈ పోటీ రెండు నేతల సమర్థతను రుజువు చేస్తుందని నాయకులు పేర్కొన్నారు.