బాబు జగ్జివన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కావలసిన నిధులు ఇవ్వాలని కోరుతూ అనకాపల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాంతీయ సదస్సుకు పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆధ్వర్యంలో బయలుదేరిన రైతు సంఘం ప్రతినిధి బృందం.
జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన చేబోదల లక్ష్మీనారాయణ (అధ్యక్షులు)తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి. విశ్రాంత ఉద్యోగ సంఘాల జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు.
సారవంతమైన సాగు భూమి ఉన్న ఉత్తరాంధ్రలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతున్న ప్రాంతాలలో ఒకటైన ఉత్తరాంధ్రలో ఉన్న సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులు 20 ఏళ్ల పాతిక ఏళ్ళు 40 ఏళ్ళు అవుతున్న పూర్తి కాకపోవడానికి ప్రధానంగా పాలకుల వైఖరి దీని కారణమని అందువల్లే జంపర్ కోట రిజర్వాయర్ పనులు ప్రారంభించి 40 సంవత్సరాలు అవుతున్న అథి లేదు గతి లేదని, జంఝావతి ప్రాజెక్టు ఒరిస్సా రాష్ట్రం తో ఉన్న చిన్న సమస్యతో ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడం విచారకరమని దేనికి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిపోవడమే కారణమని అదే సందర్భంలో 1050 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతున్న వాగులు,గెడ్డలు ఎన్ని ఉన్నా పంటల కొరకు వర్షాల పైన ఆధార పడాల్సిన పరిస్థితి.
ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టడానికి అనకాపల్లి లో జరుగుతున్న ప్రాంతీయ సదస్సు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రస్తుత తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరు అందక వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన దీనస్థితి రైతులది. దీనికి ప్రధాన కారణం ఆధునీకరణ పనులు సకాలంలో జరగకపోవడం జరుగుతున్న పనుల్లో నాణ్యతలోపము,షటర్స్ లేకపోవడం, లస్కర్లు లేమి వంటి అంశాలు పై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో జంపర్ కోట, తోటపల్లి కాలువలు ఆధునీకరణ పనుల సమితి నాయకులు రైతులు పెద్ద ఎత్తున అనకాపల్లి తరలి వెళ్లారునారు.
ఈ కార్యక్రమంలో నారు జనార్దన్ రావు జిల్లా అధ్యక్షులు విజయనగరం కిమిడి రామ్మూర్తి నాయుడు అధ్యక్షులు కౌలు రైతుల సంఘం పార్వతీపురం, పామోడి వైకుంఠ రావు, తాడాల తవిటి నాయుడు, గేదెల సత్యం నాయుడు నాయుడు, బాలగ దుర్గారావు, పారి నాయుడు, తదితరులు ఉన్నారు.