అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట మండలం రాజానగరం ఉన్నత పాఠశాలలో జరిగిన దుర్ఘటనలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్(45) మృతి చెందారు.ఈ సంఘటనపై హోంమంత్రి వంగళపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో జరుగుతున్న కళావేదిక నిర్మాణ పనుల కోసం క్రేన్ సాయంతో శ్లాబ్ సామగ్రిని పైభాగానికి తరలిస్తుండగా, అకస్మాత్తుగా క్రేన్ కూలిపోయింది.
ALSO READ:Telangana EMRS విజేతలకు CM రేవంత్ రెడ్డి అభినందనలు
ఆ సమయంలో పాఠశాల లోపలికి వెళ్తున్న ఉపాధ్యాయురాలిపై భారీ సామగ్రి పడటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, మార్గమధ్యలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
హోంమంత్రి అనిత అధికారులతో సంప్రదించి పూర్తి వివరాలు సేకరించిన ఆమె, వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
