ఎమ్మిగనూరులో సిఐ సుదర్శన్ బదిలీపై విద్యార్థుల నిరసన

Students in Emmiganur rally against the transfer of CI Sudarshan Reddy, citing his positive impact on local safety and anti-social activities control. Students in Emmiganur rally against the transfer of CI Sudarshan Reddy, citing his positive impact on local safety and anti-social activities control.

ఎమ్మిగనూరు పట్టణంలో సిఐ సుదర్శన్ రెడ్డి బదిలీకు వ్యతిరేకంగా విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ సీఐఎల్ గణేష్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రసన్నకుమార్ , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రంగ స్వామి ,హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ డివిజన్ అధ్యక్షులు అజిత్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ బదిలీను ఆపాలని ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా పట్టణ సిఐ సుదర్శన్ రెడ్డి ఎమ్మిగనూరుకు వచ్చి మూడు నెలలు అయ్యి పట్టణంలో శాంతిభద్రతలు మెరుగు పరచారని ,అలాగే గంజాయి ,గుట్కా,జూదం, అసాంఘిక కార్యకరాకాలపై ఉక్కు పాదం మోపి అనిచివేశారని ఇటువంటి సీఐని మనం ఎప్పుడూ చూడలేదని నాయకులు పేర్కొన్నారు .కాబట్టి శాంతిభద్రతల పర్యవేక్షిస్తున్న ఇటువంటి సిఐ ను ప్రభుత్వం అక్రమ బదిలీ చేయడం సిగ్గుచేటనే కాబట్టి తక్షణమే సిఐ సుదర్శన్ రెడ్డి బదిలీను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *