గాజువాక సమత రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లను ఇచ్చి, రోటరీ కుట్టు మిషన్ల ట్రైనింగ్ సెంటర్లో పదిమందికి ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లు ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగినది. ఈ ట్రైనింగ్ సుమారు 14 రోజులు ఉంటుందని, వీరికి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పది ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లను ఈనెల 20వ తారీకున వారికి అందజేస్తామని, ఒక్కో ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్ సుమారు ₹ 25000 – ₹30000 ఉంటుందని, రోటరీ క్లబ్ ద్వారా ఈ పదిమందికి ఉపాధి కల్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సిరట్ల శ్రీనివాస్(వాసు) చెప్పారు. ఈ ఎంబ్రాయిడరీ మిషన్లు రోటరీ క్లబ్ కి రావడానికి తోడ్పడిన పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ సుబ్బారావు గారికి మరియు ప్రస్థుత గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్టర్ రాజు, సెక్రటరీ సూర్యనారాయణ, రోటరీ ఫ్రీ హోమియో క్లినిక్ డాక్టర్ జ్యోష్న మరియు టైలరింగ్ ట్రైనర్ సైలజ పాల్గొన్నారు.
ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లకు రోటరీ క్లబ్ శిక్షణ ప్రారంభం
