డొనాల్డ్ ట్రంప్ గెలిచిన నేపథ్యంలో తనలాంటి ట్రాన్స్ జెండర్లకు అమెరికాలో భవిష్యత్తు లేదని ఎలాన్ మస్క్ కూతురు వివియాన్ విల్సన్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా విడిచి వెళ్లాలనే ఆలోచన తనలో పునరుద్ధరించబడిందని ఆమె తెలిపారు. ట్రంప్ నాలుగేళ్లపాటు ప్రభుత్వంలో ఉంటారని తెలుసుకోనూ, ట్రాన్స్ జెండర్ల పట్ల ప్రజల మనస్తత్వం త్వరగా మారబోదని అనుకుంటున్నట్లు వివియాన్ చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్ జెండర్లకు తగిన గౌరవం లభించడంపై ఆమె అనుమాన వ్యక్తం చేశారు. ఆమె చెప్పిన ప్రకారం, అమెరికా ప్రజల్లో ట్రాన్స్ జెండర్ల పట్ల ఉన్న భావన త్వరలో మారే సూచనలు లేవని ఆమెకు స్పష్టమైంది. ట్రంప్ గెలిచాడనే వార్త తనకు మరింత స్పష్టతనిచ్చిందని వివియాన్ వెల్లడించారు.
వివియాన్, ఎలాన్ మస్క్ మొదటి భార్య ద్వారా పుట్టిన ఆరుగురు పిల్లల్లో ఒకరు. అబ్బాయిగా పుట్టినప్పటికీ అమ్మాయిగా మారాలనే ఆమె నిర్ణయం తీసుకోగా, 2022లో ఆమె తన పేరు, లింగాన్ని మార్చుకున్నారు. తన నిర్ణయంతో ఆమె తండ్రి ఎలాన్ మస్క్‌తో ఉన్న సంబంధాలు దూరమయ్యాయి, అప్పటినుంచి తండ్రితో ఎలాంటి సంబంధాలు కొనసాగించకుండా వివియాన్ జీవనం కొనసాగిస్తున్నారు.