కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నియోజకవరర్గ ఇంచార్జి వరుపుల సుబ్బారావుని ఆయన నివాసంలో నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.నూతన మీడియా కార్యవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు
అభినందించి శుభాకాంక్షలు తెలిపి ప్రెస్ క్లబ్ సభ్యులు 60 మందిని ఆయన పరిచయం చేసికున్నారు.ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనని ఘనంగా సన్మానించగా అనంతరం మాజీ ఎమ్మెల్యే వరుపుల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దాకారపు కృష్ణ,ప్రధాన కార్యదర్శి తుమ్మల సుబ్బులని సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మానూరి గంగరాజు,సివిఆర్ వాసు,ఎండి అధికార్, ప్రత్తిపాడు,ఏలేశ్వరం,శంఖవరం,రౌతులపూడి,కిర్లంపూడి మండలాల ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
వరుపుల సుబ్బారావు నివాసంలో ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం
