నార్సింగ్ మండల కేంద్రంలోని సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను పిఏ సీఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి తో పాటు డైరెక్టర్లు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంకు సరైన అవగాహన లేదని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, నాయకులకు అధికారులకు మధ్య సమన్వయం లేదని, ఆయన మండిపడ్డారు. రైతు భరోసా ఇప్పటికి కల్పించలేదని, రైతుల రుణమాఫీ ఇంకా చాలామంది కావాల్సి ఉందని, వెంటనే ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం కానీ కేంద్రాలకు గన్ని బ్యాగులు ఇంకా రాలేదని, రైస్ మిల్లు యాజమాన్యంతో అధికారులు సమన్వయంగా పనిచేయడం లేదని గోడౌన్ లో పరిస్థితి ధాన్యం రవాణా పై ప్రభుత్వం ఆలోచన లేదంటూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కరీం, ఎంపీడీవో ఆనంద్, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బాణాపురం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్లేశం గౌడ్, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి భూపతి రాజు, పార్టీ సీనియర్ నాయకులు శ్రీపతిరావు, నరసింహ చారి, సంపత్ రెడ్డి, జీవన్ కుమార్, సత్యం, జగన్ రెడ్డి, శ్రీనివాస్, రాములు, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే ప్రారంభించారు
