రాజానగరంలో డ్రగ్స్ దొరకడంతో వార్తలలోకి ఎక్కింది రాష్ట్రవ్యాప్తంగా కూటమి అధికారంలోకి రాగానే రాయడం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిధిలోని జి ఎర్రం పాలెం అనే గ్రామంలో సీరా స్టూడియో స్పేస్ గేస్ట్ హోస్ లో జరుగుతున్న ఒక పుట్టినరోజు వేడుకలలో ముందస్తు సమాచారంతో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కొవ్వూరు డిఎస్పి నార్త్ జోన్ ఇన్చార్జి డిఎస్పి జి దేవ కుమార్ రాజానగరం పోలీస్ స్టేషన్ లో పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాడే పల్లిగూడెం కు చెందిన దేవాభక్తుని దినేష్ అనే యువకుని పుట్టినరోజు సందర్భంగా జి ఎర్రం పాలెం అనే గ్రామంలో సీరా స్టూడియో స్పేస్ గేస్ట్ ఏర్పాటు చేసిన పార్టీ సందర్భంగా దేవ భక్తుని దినేష్, పవన్ కుమార్ బాలం అజయ్ దువ్వన బోయిన పుష్పరాజ్ వేమన విక్రమ్ రాధా గగన్ అలియాస్ గగన్ పార్టీ చేసుకుంటున్న సందర్భంగా ఎం డి ఎం ఏ అనే డ్రగ్ సేవించే అలవాటు ఉన్నదని వీరు క్రిప్టో కరెన్సీ ద్వారా 4 గ్రాములు ఆన్లైన్ లో బుక్ చేసుకుని డిటిడిసి కొరియర్ ద్వారా తెప్పించుకోవడం జరిగిందని దీని విలువ సుమారు 32 వేల రూపాయలు ఉంటుందని ఢిల్లీ నుంచి తాడేపల్లిగూడెం రాగ తాడేపల్లి గూడెం నుండి దినేష్ మరియు పవన్ లకు ఇచ్చి పార్టీలో రావడం జరిగింది అలాగే ఇదే పార్టీలో అజయ్ మరియు పుష్పరాజులు 50 గ్రాములు గంజాయి సేవించి నిమిత్తం ఒక సాధువు దగ్గర కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐదు రెడ్ లేబుల్ లిక్కర్ ఫుల్ బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని నలుగురు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు వీరిపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ 1985 ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందని ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరుగుతుందని కాగా పవన్ అనే ముద్దాయి పరార్ లో ఉన్నట్టు అతనికోసం కూడా గాలిస్తున్నట్లుగా డిఎస్పి తెలిపారు. ఈ సమావేశంలో రాజానగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ పవన్ వీరయ్య గౌడ్,ఎస్ ఐ. పి మనోహర్ పాల్గొన్నారు.
రాజానగరంలో పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ పట్టివేత, నలుగురు అరెస్ట్
