తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ MD పీవీ గౌతమ్ ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మినట్లయితే POT యాక్ట్ ప్రకారం లబ్ధిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.
ఈ ఇళ్లను అమ్మినట్లయితే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందని, అద్దెకు ఇచ్చిన సందర్భంలో కూడా కేటాయింపులు రద్దు చేయబడతాయని స్పష్టం చేశారు.
ALSO READ:Telangana Global Summit 2025 | TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
GHMC పరిధిలో సర్వే పూర్తి అయ్యిందని, త్వరలో జిల్లాల్లో కూడా పరిశీలన జరుపనున్నట్టు చెప్పారు. కొల్లూరు, రాంపల్లి ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు ₹20–50 లక్షలకు అమ్మకానికి ఉంచబడినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను అమ్మడం నిషేధమని, లబ్ధిదారులు చట్టానికి లోబడి ఉంటేనే ఇళ్లు ఉపయోగించుకోవచ్చని MD సూచించారు.
