గర్భిణీలు,ఐదేళ్లలోపు పిల్లలు, కిషోర బాలికల్లో రక్తహీనత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సీడిపిఓలను ఆదేశించారు. రక్తహీనత నివారణ పట్ల ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వం అనుమతి పొందిన ఇంజక్షన్లు కూడా ఇప్పిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రతి గర్భిణీకి ఒక కార్డు ఇవ్వాలని, ఆమె క్రమం తప్పకుండా తీసుకుంటున్న వాటిని ఆ కార్డు నందు నమోదు చేయాలన్నారు. గర్భిణీలు రక్తహీనతతో ప్రాణాపాయ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత సీడిపిఓ లదేనని కలెక్టర్ తేల్చిచెప్పారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడంతో పాటు, వయసుకు తగిన బరువు,ఎత్తు పెరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా సంబంధిత సీడిపిఓలదేనని కలెక్టర్ వివరించారు.
గర్భిణీల ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు
