అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ధార గంగవరంలో అక్టోబర్ 9 వ తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి స్థానిక రామాలయం వద్ద నుండి పురవీధుల్లో భోనాలు సంబరం మొదలవుతుందని గ్రామ పెద్దలు సుర్ల యోగేశ్వరుడు, మిడతాన వినయ్ తెలిపారు.
ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బోనాల సంబరం తో మొదలై సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారి సన్నిధిలో అగ్నికొండ మహోత్సవం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భవానీలు భక్తులు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు .