పల్నాడు జిల్లాలోని వినుకొండ లో దాదాపు 700 సంవత్సరాల పురాతన చరిత్ర గలిగిన పాత శివాలయంలో పూజారి గుడిని అపవిత్రం చేసాడట్టు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ పూజారి పవిత్రమైన శివాలయం గర్భగుడిలోని అమ్మవారి వద్ద మద్యం సేవిస్తున్నట్టుగా కనిపించినా పూజారి ప్రసాద్.. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించాల్సిన అవసరం లేదా? ఇప్పటివరకు ఆలయ అర్చకులు కానీ, అధికారులు కానీ స్పందించకపోవడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఘటన చోటు చేసుకుందా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. దీనిపై నిజానిజాలు పూర్తిగా అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది.
పురాతన శివాలయంలో అపవిత్ర చర్యపై భక్తుల ఆగ్రహం
