కాంట్రాక్ట్ ఎ.ఎన్.ఎం.లకు రాత పరక్ష లేకుండ రెగ్యులర్ చేయాలని వరంగల్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఎదుట ఎ.ఎన్.ఎమ్.లు ధర్నా చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖలో 2000 సంవత్సరము నుండి నేటి వరకు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న ఎ.ఎన్.ఎమ్.లు రెగ్యులరైజెషన్, కనీస వేతనాలు, ఇతర చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని దశాబ్ధల తరబడి దశలవారి ఆందోళన, పోరాటాలు, నిరవధిక సమ్మెలు చేసామని సమ్మెల సందర్భంగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కావడం అని యూనియన్ నాయకులు మాట్లాడారు. ఎ.ఎన్.ఎమ్.లకు రాత పరీక్ష లేకుండ రెగ్యులర్ చేయాలి అని సర్వీసు వెయిటెజి 50 మార్కులు ఇవ్వాలి అని వయోపరిమితిని ఎత్తి వేయాలి అని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని ఎక్స్రేషియ, ఆరోగ్య భీమ సౌకర్యం కల్పించాలి అని జనాభా ప్రతిపదికన సబ్ సెంటర్లను పెంచాలి అని డిమాండ్స్ వారు చేశారు.
ఎ.ఎన్.ఎమ్.లకు రెగ్యులర్ చేయాలని ధర్నా
