శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన కొత్త అల్పపీడనం వేగంగా బలపడుతోంది. ఇది ఈ రోజే వాయుగుండంగా మారి, చెన్నై నగర సమీపంలో తీరం దాటే ముందు తీవ్ర వాయుగుండం లేదా స్వల్ప తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ALSO READ: White House incident: అమెరికాలో నేషనల్ గార్డ్‌పై దాడి..అదనపు బలగాల దింపిన ట్రంప్
ఈ వ్యవస్థ ప్రభావంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 29వ తేదీ రాత్రి నుంచే ఈదురు గాలులు, చిరు నుంచి భారీ వర్షాలు ప్రారంభమవుతాయని అంచనా. నవంబర్ 30 మరియు డిసెంబర్ 1 తేదీల్లో తిరుపతి, నెల్లూరు, దక్షిణ ప్రకాశం జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
డిసెంబర్ 1న మధ్య ఆంధ్ర ప్రాంతాలైన ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలు కూడా భారీ వర్షాలు, గాలులకు అప్రమతంగా ఉండాలి.
అదేవిధంగా రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో కూడా వచ్చే 48 గంటలు వాతావరణ ప్రభావం కొనసాగనుంది. అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
