కొందరిని సైబర్ క్రైమ్స్ నేరగాళ్లను అరెస్టు చేయగానే పైరసీలు ఆగిపోతాయి అనుకోవద్దు హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ వ్యాఖ్యానించారు.టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ స్పందించారు.
పైరసీ పూర్తిగా ఆగిపోదన్న వాస్తవాన్ని గుర్తుచేస్తూ, “ఒకరిని అరెస్టు చేయగానే నేరాలు ఆగవు. ఒకడు పోతే మరొకడు వస్తాడు. ఈ సైబర్ నేరాలు కొనసాగుతూనే ఉంటాయి” అని స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో “ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?” అని వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు.
ALSO READ:BJP Counter to Rajamouli: ‘దేవుడిపై నమ్మకం లేదు’ అన్న వ్యాఖ్యలపై మాధవీలత ఫైర్
పైరసీ మరియు ఇతర ఆన్‌లైన్ నేరాలకు మూల కారణం తక్షణ డబ్బు సంపాదించాలని చూడటమేనని, ఈ ఆలోచన తగ్గకపోతే నేరాలు తగ్గవని చెప్పారు. “జీవితంలో ఏదీ ఫ్రీగా రాదు” అని రాజమౌళి చెప్పిన మాటలను ఉదహరిస్తూ ప్రజల్లో అవగాహన పెరగాలని సూచించారు.
పైరసీ పరిశ్రమకు నష్టం చేస్తుందని, పోలీసులు మాత్రమే కాకుండా సమాజమంతా దీనిని అరికట్టడానికి సహకరించాల్సిన అవసరం ఉందని CV ఆనంద్ పేర్కొన్నారు.
