పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అక్టోబర్18వ తేదీ అనగా శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని మండల కేంద్రంలో విద్యుత్ కార్యాలయాలు వద్ద వినతి పత్రాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర ,జిల్లా కమిటీలు పిలుపు మేరకు కొమరాడ మండల కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద షిఫ్ట్ ఆపరేటర్ వేణుగోపాల్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి పత్రిక విలేకరులతో మాట్లాడుతూ గత వైయస్సార్ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయని దీనివల్ల దళితులు గిరిజనులు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురయ్యారని ఇలాంటి సందర్భంలో వైయస్సార్ ప్రభుత్వానికి చిత్తుగా ఓడించారని ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భముగా మొన్న జరిగిన ఎన్నికల ముందు ఈ ప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పడం జరిగిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు విద్యుత్ చార్జీలు పెంచబోమంటూనే ట్రూఅప్ ఛార్జీల పేరుతో గతం నుంచి 20 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయడాన్ని,ఈ ప్రభుత్వం అమలును సిపియం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అలాగే ట్రూఅప్ ఛార్జీల పద్దతిని రద్దు చేయాలని. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని గిరిజన దళిత కుటుంబాలకు సబ్సిడీ రూపంలో బిల్లులు తగ్గించి ఇవ్వాలని అలాగే వ్యవసాయ విద్యుత్తు బోర్లు గాను మరియు ఇంటి నిర్మాణంగాను స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని ఈ విధంగా వెంటనే విద్యుత్ బిల్లులు తగ్గించి అన్ని విధాలుగా ప్రజలను ఆదుకోవాలని లేని యెడల ఇంకా ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయుచున్నాము ఈ కార్యక్రమంలో శివుని నాయుడు సింహాచలం కృష్ణ పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీలు తగ్గించాలని సిపిఎం పార్టీ వినతి
