- రాజ్యాంగాన్ని కాపాడుకుందాం- దేశాన్ని రక్షించుకుందాం అంటూ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు
- అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి – సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకుల డిమాండ్
మతోన్మాద శక్తుల విచ్ఛిన్నకర శక్తుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం అంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణం నెల్లూరు రోడ్డు నందుగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా నాయకులు చంద్రమోహన్ రాజు జకరయ్య లు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన పార్టీ జిల్లా నాయకులు సంగటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆమోదింపబడి పూర్తయినా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, నేటి బిజెపి ప్రభుత్వం దేశ సంపదను అతి కొద్దిమంది కార్పొరేట్లకు దేశాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను మరింత దారిద్ర్యమ్ లోకి నెట్టివేసిందని, కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను సవరించి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నదని, ప్రభుత్వ రంగ సంస్థలను నిస్సిగ్గుగా ప్రైవేటుపరం చేస్తున్నదని వారు విమర్శించారు. దేశంలో ప్రజా సుపరిపాలన కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగ అమలకు మనువాద బిజెపి ప్రభుత్వం ఏ మాత్రం ఇష్టపడడం లేదని, తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవడంలో భాగమే పార్లమెంటులో అంబేద్కర్ పైన అమిత్ షా వ్యాఖ్యలు చేయడం మరియు ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రవేశపెట్టడం అని వారు విమర్శించారు. దేశంలో సామాజిక సన్మానత్వం కోసం అహర్నిశం పనిచేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తొలగించి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని నెత్తికెత్తుకోవాలని పాలకులు భావిస్తున్నారని అందులో భాగమే ఈ అమిత్ షా వ్యాఖ్యలు అని వారు విమర్శించారు అంబేద్కర్ ఆశయాల పట్ల ఆయన రచించిన రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్ బిజెపి వాదులు ఎప్పటికీ వ్యతిరేకతతో ఉన్నారని వారు గుర్తు చేశారు. తమ విధానాలకు అనుకూలంగా భారత రాజ్యాంగంలో మార్పులకు చర్యలు చేపట్టి తమకు అనుకూలమైన చట్టాలను తీసుకొస్తున్న బిజెపి ఆర్ఎస్ఎస్ విధానాలను వ్యతిరేకించే ఉద్యమంలో ప్రజాస్వామ్యవాదులు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక రైతులు మద్దతు ఇవ్వాలని, అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని వారి డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జకరయ్య, చంద్రమోహన్ రాజు మరియు ఏరియా నాయకులు రామరాజు, కే బాబు, చెన్నయ్య, సుబ్రహ్మణ్యం, రాము, పాండు, మోహన్, బాబు, జైపాల్, రేనాటి శ్రీనివాసులు, జయరామ్ రాజు, శివరాం, సూరి, చంద్రపాల్,నారాయణ,ఈశ్వర్,లూకయ్య, సుబ్బయ్య,శాంసన్, విద్యార్థి సంఘ జిల్లా నాయకులు బండి అనిల్,తరుణ్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.