కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ ముద్దసాని పవన్ (25) ఆత్మహత్యకు యత్నించడంతో కలకలం రేగింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సహచరులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అతడి ప్రాణాలు కాపాడినట్లు సమాచారం.
కానిస్టేబుల్ పవన్ స్వస్థలం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలం రాజంపేట. విధి నిర్వహణలో ఒత్తిడితోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విధుల్లో మెలకువగా ఉండడం వల్ల కళ్ల మంట తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశానని బాధితుడు వెల్లడించాడు.
పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ శాఖలో పని ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి అంశాలపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.