పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడియా భాస్కర్ నాయక్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వాహంచారు.ఈ సందర్భంగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, వీరమనేని యాకాంతరావు లు మాట్లాడుతూ.. నేడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన.. మహా ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులపై మాట్లాడిన తీరు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. అధికారం కోల్పోయి మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజన యువకుడు లకావత్ శ్రీను మరణానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. శ్రీను కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
గిరిజన యువకుడి మరణంపై కాంగ్రెస్ స్పందన
