రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడిచిన కూడా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీని అమలు చేయని కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో బస్సు ప్రయాణికులను కలిసి వారి యొక్క విన్నపాలను సీఎం గారిని అడ్రస్ చేస్తూ పోస్ట్ కార్డులు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మహిళల నుండి మంచి స్పందన లభించింది అని కావున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని రామ్మోహన్రావు అన్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి మహిళలకు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లంక రామ్మోహన్, రంగబాబు దండుపాయిని చంద్రశేఖర్ సుబ్రమణ్య శర్మ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మహిళల ఉచిత బస్సు సౌకర్యం కోసం కాంగ్రెస్ పార్టీ నిరసన
