తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం పూర్తి భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్, వేలేరు మండలాలకు చెందిన 50మంది లబ్ధిదారులకు 16లక్షల 34వేల రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు కాంగ్రెస్ ప్ర భుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయన్ని బాధితులకు అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదలప్రాణాలునిలబడుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని.. ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని అన్నారు.