పార్లమెంటు వెలుపల బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నిరసనలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాబా సాహెబ్ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన తెలిపారు.
కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా రాహుల్, ప్రియాంక తదితరులు అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను అవమానించారని ఆరోపించారు.
ఈ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వారు అమిత్‌షా నుంచి క్షమాపణలు కోరుతూ, ఆ పదవి నుంచి తప్పుకోవాలని అనుచించారు.
అటు, బీజేపీ ఎంపీలు ఈ నిరసనపై స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీనే అంబేడ్కర్‌ను అవమానించిందని ఆరోపించారు. వారు కాంగ్రెస్ పార్టీ చర్యలను తీవ్రంగా ఖండించారు.