ప్రాణహాని ఉందని మీడియాలో వాయిస్ ఇవ్వడం వల్ల లాభం ఉండదని సూచిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరు సురక్షితంగా ఉంటారని, కూటమి గెలుపు కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS తరపున మీకు హామీ ఇస్తున్నాం. మీకు ఎవరితోనైనా ప్రాణభయం ఉంటే వారి పేర్లు వివరాలు ప్రభుత్వానికి తెలియజేసి వారిపై చర్యలు తీసుకునే విధంగా, మరియు మీరు రక్షణ పొందే విధంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాము. అంతేగాని మీరు ప్రాణ భయం ఉంటే పోలీసులను కలవకుండా ఐ డ్రీమ్ నాగరాజును కలవడంలో ఆయనకు మీ గోడు చెప్పి యూట్యూబ్ లో పెట్టడం వల్ల ఎలాంటి లాభం ఉండదని తెలియజేస్తున్నాము.
రాజ్యాంగబద్ధ పదవి అయిన ఎమ్మెల్యే సీట్లో ఉన్న ఆదోని ఎమ్మెల్యే గారు తనకు ప్రాణహాని ఉందని భావిస్తే చట్ట ప్రకారం పోలీసులను కలవాలిగాని మీడియాలో ప్రెస్ మీట్ ఇవ్వడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చిన వారవుతారని మనవి చేసుకుంటున్నాము. మాటిమాటికి తనకు ప్రాణహాని ఉందని చెప్పి ఆదోని పేరును బదనాం చేయకండి అని చేతులు జోడించి మొక్కుతున్నాము. మీరు ఇలాంటి వాయిస్ ఇవ్వడంలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆదోనికి చెడ్డ పేరు వస్తుందని గుర్తించాలని మనవి చేసుకుంటున్నాము.
MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ , వసీం సాహెబ్, రామలింగ, నరేంద్ర యాదవ్ తదితరులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు.
ప్రాణభయానికి సంబంధించి ప్రజలకు స్పష్టం
