శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా, పిల్లలు అన్ని రకాల విద్య యందు నైపుణ్యత పెంపొందించుట కొరకే, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం, ప్రతి విద్యార్థి నందు ప్రత్యేకమైన శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో విద్యాబోధన
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా స్కూల్ యాజమాన్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ గాలి కృష్ణ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతగా ఆదరించిన తల్లిదండ్రులకు ధన్యవాదములు ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసాం అనగా పిల్లల పట్ల పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ప్రేమానురాగాలు, ఈయన మన దేశ మొదటి ప్రధాని, పుట్టినరోజు వేడుకలు దేశమంతా ఈ రోజున జరుపుకుంటాయని అన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన నా రౌతులపూడి మండలం లో ఎంతోమంది పిల్లలు విద్య పట్ల వెనుకబడి ఉన్నారు వారందరి కోసమే తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రారంభించమని తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల యొక్క తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షించేయని, ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదములు తెలిపారు.
శ్రీ హర్ష స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు
