యాజమాన్యం వ్యవహారం పై తల్లితండ్రులు ఆగ్రహం చంద్రగిరి తిరుపతిలోని చైతన్య టెక్నో స్కూల్(Chaitanya Techno School)లో విద్యార్థుల భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ ప్రాంగణంలో ఆటలు ఆడుతూ జారిపడి చెయ్యి విరిగిన విద్యార్థి మహానాయక్‌కు తక్షణ చికిత్స అందించకుండా నిర్లక్ష్యం, స్కూల్ యాజమాన్యం ఘటనను పెద్దగా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గాయం అయిన చాలా సమయం తర్వాత మాత్రమే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహానాయక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై వివరణ కోరగా, బాధిత కుటుంబంపై తిరగబడుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన స్కూల్ టీచర్ల వ్యవహారం తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన రేపింది.
ALSO READ:Digital Arrest Scam: అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు
విద్యార్థుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తూనే, పిల్లల భద్రత, ఆరోగ్యంపై మాత్రం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.అర్హతలు లేని టీచర్ల నియామకం, ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడం వంటి అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
