వరంగల్ అభివృద్ధి కోసం రూ. 4962 కోట్ల కేటాయింపు
ప్రజా పాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్… కాకతీయ కాలం నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగరం. దశాబ్దకాలంగా నిర్లక్ష్యపు నీడలు. తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం. చారిత్రక నగరాన్ని అభివృద్ధి బాటన నడిపించడానికి నడుం బిగించిన ప్రజా ప్రభుత్వం. 2041 మాస్టర్ ప్లాన్ తో…
