మహిళ రక్షణ కోసం “పోలీస్ అక్క” కొత్త కార్యక్రమం
జిల్లాలో మహిళ రక్షణ ప్రధాన లక్ష్యంగా పోలీసులు మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు. సిరిసిల్ల జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో “పోలీస్ అక్క” పేరుతో మహిళా కానిస్టేబుళ్లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. “పోలీస్ అక్క”గా ఎంపికైన కానిస్టేబుళ్లు షీ టీమ్‌తో కలిసి పనిచేస్తూ, పాఠశాలలు, కళాశాలల్లో సందర్శనలు చేస్తారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీసింగ్, మహిళా…
