వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుటుంబం వద్ద రూ. లక్ష కోట్లు ఉన్నాయని ఆరోపించి, వరద సహాయ నిధిగా రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శ

‘పదేళ్ల పాలనలో రూ.లక్ష కోట్లు వెనకేశారు.. రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలం అవుతున్న ఈ పరిస్థితిలో కనీసం రూ.2 వేల కోట్లన్నా సీఎం సహాయ నిధికి ఇవ్వొచ్చు కదా’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పర్యటించి వరద…

Read More
సీఎం రేవంత్ రెడ్డి, హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణ కోసం ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం.

రంగనాథ్‌కు మ‌రో కీల‌క బాధ్య‌త

ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ)ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంస్థ‌కు క‌మిష‌న‌ర్‌గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న‌కు మ‌రో కీల‌క బాధ్య‌త‌ను అప్ప‌గించే యోచ‌న‌లో తెలంగాణ స‌ర్కార్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.   హెచ్ఎండీఏ ప‌రిధిలోని చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా రంగ‌నాథ్‌ను నియ‌మిస్తార‌ని స‌మాచారం….

Read More
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడంలేదు. కుండపోత వర్షాలకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో చాలామంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు మరో హెచ్చరిక చేశారు. ఈ నెల 5న (గురువారం) బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తెలంగాణలోని ఎనిమిది రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం…

Read More
న్యాయవ్యవస్థపై తనకున్న విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పత్రికా కథనాలపై క్షమాపణ చెప్పి, సంబంధం లేని వ్యాఖ్యలను ఖండించారు.

న్యాయ వ్యవస్థపై అపార గౌరవంతో రేవంత్ రెడ్డి వివరణ

భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్ట్ 29న కొన్ని పత్రికలు రాసిన కథనాలు… గౌరవనీయ న్యాయస్థానం యొక్క న్యాయపరమైన విజ్ఞతను తాను ప్రశ్నిస్తున్నాననే అభిప్రాయం తనపై కలిగేలా చేసిందనే విషయాన్ని అర్థం చేసుకోగలనని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.  న్యాయ వ్యవస్థను తాను ఎంతో విశ్వసిస్తాననే విషయాన్ని మరోసారి గట్టిగా చెపుతున్నానని రేవంత్ అన్నారు. మీడియాలో…

Read More
ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్, తనకు న్యాయం జరగలేదని ఆత్మహత్యకు ప్రయత్నించారు. రామారెడ్డి MRO కార్యాలయం ముందు పురుగుల మందు తాగిన ఆయనకు తహసిల్దార్ సువర్ణ విచారణ చేసిన తర్వాత, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి న్యాయం చేయాలని హామీ ఇచ్చారు.

ఉప్పల్ వాయి రైతు ఆత్మహత్య ప్రయత్నం

నిన్న ఉప్పల్ వాయి గ్రామనికి చెందిన రైతు మంత్రి భగవాన్ తనకు ఆన్యాయం జరిగిందని రామారెడ్డి MRO కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి రామారెడ్డి మండల తహసిల్దార్ సువర్ణను వివరణ కోరగా తహసిల్దార్ సువర్ణ మీడియాతో మాట్లాడుతూ మంత్రి భగవాన్ నిన్న తనకు అన్యాయం జరిగిందని తనకు న్యాయం జరగలేదని తాను చావాలనుకునే ప్రయత్నం చేశాడని అతనికి సంబంధించినటువంటి భూమి వద్దకు వెళ్లి ఈ రోజు మోక…

Read More
పెళ్లి నిరాకరణతో హైదరాబాద్‌ లో యువకుడు స్నేహితురాలిని కత్తితో చంపి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి నిరాకరణతో కత్తితో దాడి, ఆత్మహత్యకు యత్నం

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఏడాదిగా వెంటపడుతున్నా పెళ్లికి ఒప్పుకోలేదనే కోపంతో ఓ యువకుడు విచక్షణ కోల్పోయాడు. స్నేహితురాలిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. అడ్డొచ్చిన ఆమె స్నేహితురాళ్లపైనా దాడి చేశాడు. ఆపై అక్కడి నుంచి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపన తమాంగ్ నల్లగండ్లలో బ్యుటీషియన్ గా పనిచేస్తోంది. గోపన్ పల్లి తండా…

Read More
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం సాయిమాధవ్ నగర్ లో జరిగిన దొంగతనని చేధించిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎఎస్పీ అవినాష్

48 గంటల్లో దొంగలను పట్టుకున్న పోలీసులు

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం సాయిమాధవ్ నగర్ లో జరిగిన దొంగతనని చేధించిన పోలీసులు. ముధోల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భైంసా ఎఎస్పీ అవినాష్..మెదరోల్లా వెంకటేష్ కుటుంబంతో హైదరాబాదు వెళ్లిన రోజు అతని ఇంట్లో నే అద్దె కు ఉన్న భార్యాభర్తలు దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు వారి నుండి 7 తులాల బంగారం ,నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. దొంగతనం జరిగిన 48 గంటలో…

Read More