రామాయంపేటలో విశ్వకర్మ జయంతి ఘనంగా. జెండా ఎగరవేసి, పూలమాలలు వేసిన ఉత్సవం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్యాకేజీ, పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కోరిన విశ్వకర్మ సంఘం.

రామాయంపేటలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని నేడు పట్టణంలోని మల్లె చెరువు కట్ట వద్ద విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలు వేసి, విశ్వకర్మ జెండాను ఎగరవేసి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ మనమయ సంఘం మండల అధ్యక్షులు కొడపర్తి లక్ష్మణాచారి, పట్టణ అధ్యక్షుడు కమ్మరి యాదగిరి చారి మాట్లాడుతూ విశ్వకర్మలకు ప్రతి జిల్లాలో కార్పొరేషన్ భవన్ ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు…

Read More
నిజాంపేట మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించి, ప్రజలకు స్వాతంత్ర్య సంగ్రామ త్యాగాలను గుర్తుచేశారు.

నిజాంపేట మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

నిజాంపేట మండల వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో సురేష్ కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో రాజిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17న స్వతంత్రం వచ్చినందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నామని అధికారులతో పాటు గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ జయపాల్ రెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వినియ్, గ్రామ కార్యదర్శి నర్సింలు…

Read More