ఉప్పల్ వాయి గ్రామానికి బస్సు సేవలను పునరుద్ధరించాలంటూ ధర్నా
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఉప్పల్ వాయి గ్రామస్తులు కొత్త బస్టాండ్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ద్వారా గ్రామానికి బస్సు సేవలు అందించాలంటూ వారు తీవ్రంగా డిమాండ్ చేశారు. గ్రామస్తులు ప్రసన్న, దాసరి పోషవ్వ, పల్లె. సుగుణ, కోరాడి లక్ష్మి, ఆస్మా మాట్లాడుతూ, తమ గ్రామానికి బస్సు రాకపోవడం బాధాకరమని చెప్పారు. గత పది నెలలుగా గ్రామానికి బస్సు రాకపోవడం వలన మహిళలు అధార్ కార్డు ఉన్నా కూడా ప్రయాణం చేయలేకపోతున్నారని వారు…
