క్రాప్ లోన్ బీమా ద్వారా మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేత
నిర్మల్ జిల్లా బైంసా మండలం దెగాం గ్రామానికి చెందిన మార్రె ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందాడు. ప్రభాకర్ క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు ప్యాక్స్ బీమా పొందారు. ప్రభాకర్ మృతి తరువాత బీమా ద్వారా వచ్చిన రూ. 2 లక్షల చెక్కును ఆయన భార్య రాత్నకు ప్యాక్స్ చైర్మన్ అమెడ దేవేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ సెక్రటరీ రాజేందర్ కూడా పాల్గొన్నారు. ప్యాక్స్ చైర్మన్ మాట్లాడుతూ, రైతులు క్రాప్ లోన్ తీసుకునే సమయంలో బీమా చేయించుకోవడం…
