మిర్యాలగూడలో ప్రైవేట్ బస్సు బోల్తా, 10 మందికి గాయాలు
మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్ పల్లి హైవేపై నందిపాడు సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు, బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం అందింది. బస్సు ఒంగోలు నుండి హైదరాబాద్ వెళ్ళేందుకు బయలుదేరింది. కానీ ప్రమాదం జరిగినప్పుడు, బస్సు అతి వేగంతో ప్రయాణిస్తోంది. డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవ్ చేస్తున్నాడని ప్రయాణికులు తెలిపారు. ఈ కారణంగా అదుపు తప్పి, రాళ్ల కుప్పను డీకొని బస్సు బోల్తా…
