
మెదక్ ఎమ్మెల్యే రోహిత్ విద్యార్థులకు ప్రోత్సాహం
రామాయంపేట మండలంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్న రోహిత్, టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు క్రీడలు, చదువుల్లో రాణించి, ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే రోహిత్ సూచించారు. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయని, స్నేహ సంబంధాలు మెరుగు పడతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్ష…