
కేసిఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు
కెసిఆర్ 10 సంవత్సరాల పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్న ఘనత కేసిఆర్ ది అని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులకు అనేక ఇబ్బందులు ఏర్పడినట్లు పేర్కొన్నారు. బోనస్ ఆశ చూపి రైతుల కళ్ళలో కన్నీరు పెట్టించిన దుస్థితి నెలకొన్నట్లు చెప్పారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని…