
బ్రహ్మలకుంట వద్ద చిరుతపులి సంచారం – అప్రమత్తంగా ఉండండి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మలకుంట గ్రామ పరిధిలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఇది నిజమైన చిరుతపులి ఆనవాళ్లు అని నిర్ధారించారు. ఈ సమాచారం తెలియగానే గ్రామ ప్రజల్లో భయం నెలకొంది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి బ్రహ్మలకుంట పరిసర ప్రాంతాల్లో మైక్ ప్రచారం నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా బయటికి వెళ్లొద్దని హెచ్చరించారు. వ్యవసాయ పనుల కోసం…