An ancient sword was discovered in a Tummuru farm. Villagers urge the government to conduct historical research as authorities remain unresponsive.

తుమ్మూరులో పురాతన కత్తి ఆవిష్కరణ గ్రామస్తుల ఆశ్చర్యం

ఒకప్పుడు రాజుల ఏలుబడిలో ఉన్న తుమ్మూరు గ్రామం నేడు చారిత్రక శేషాలను వెలికితీస్తోంది. అడపాదడపా రైతులు వ్యవసాయ పనులు చేస్తుండగా పురాతన వస్తువులు బయటపడుతున్నాయి. తాజాగా ఓ రైతు పొలం దున్నుతుండగా నాగలి కర్రకు పట్టి శిధిలావస్థలో ఉన్న పురాతన కత్తి వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అదే ప్రాంతంలో పంచలోహాల వీరభద్రుని విగ్రహాలు బయటపడ్డ ఘటనలు ఉన్నాయి. కళ్యాణ స్వామి ఆలయ పరిసరాల్లో కాకతీయుల కాలానికి చెందిన అనేక చారిత్రక నిర్మాణాలు, సొరంగ మార్గాలు కనబడుతున్నాయి….

Read More
A leopard has been spotted near Brahmalakunta in Khammam district. Forest officials urge people to stay cautious.

బ్రహ్మలకుంట వద్ద చిరుతపులి సంచారం – అప్రమత్తంగా ఉండండి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మలకుంట గ్రామ పరిధిలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఇది నిజమైన చిరుతపులి ఆనవాళ్లు అని నిర్ధారించారు. ఈ సమాచారం తెలియగానే గ్రామ ప్రజల్లో భయం నెలకొంది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి బ్రహ్మలకుంట పరిసర ప్రాంతాల్లో మైక్ ప్రచారం నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా బయటికి వెళ్లొద్దని హెచ్చరించారు. వ్యవసాయ పనుల కోసం…

Read More
In Buggapadu village, an elderly couple was found dead in a lake. Locals suspect suicide due to financial struggles, as confirmed by their family.

బుగ్గపాడు గ్రామంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు గ్రామంలో విషాదం నెలకొంది. ఈ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు చెరువులో శవమై తేలినట్లు గుర్తించారు. మృతులుగా పంతంగి కృష్ణ (60), సీతా (55) పేర్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ రోజు తెల్లవారు జామున పొలానికి వెళ్ళే రైతులు గ్రామ శివారులోని రావి చెరువులో రెండు మృతదేహాలను కనిపెట్టి పోలీసులకి సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయం తో మృతదేహాలను బయటికి తీశారు. కృష్ణ…

Read More
A young cricketer named Vijay collapsed during a match at a tournament in Khammam and later died of a heart attack. The incident occurred at Kusumanchi mandal.

ఖమ్మంలో క్రికెట్ ఆడుతున్న యువకుడి గుండెపోటు, మరణం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీలో విషాదం చోటు చేసుకుంది. టోర్నమెంట్‌లో భాగంగా క్రికెట్ ఆడుతున్న విజయ్ అనే యువకుడు ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో, వెంటనే నిర్వాహకులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రిలో వైద్యులు అతన్ని పరీక్షించిన అనంతరం గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి తక్షణమే వైద్యుల బృందం అతన్ని పరిశీలించినప్పటికీ, గుండెపోటు కారణంగా అతని ప్రాణాలు బలగొల్పినట్లు స్పష్టమైంది. ఈ…

Read More
A speeding car hit a pole on Sattupalli Bridge; four youths escaped with minor injuries. Police cleared the site, restoring traffic.

సత్తుపల్లి బ్రిడ్జిపై కారు ప్రమాదం, నలుగురు సురక్షితం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తెల్లవారుజామున ఓ కారు ప్రమాదానికి గురైంది. వరంగల్ కు చెందిన ముగ్గురు యువకులు వైజాగ్, అరకు విహారయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఈ సమయంలో సత్తుపల్లి బ్రిడ్జి వద్ద వారి కారు రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం, ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. బ్రిడ్జిపై కారు పల్టీలు కొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు కనిపించింది. అయితే కారులో ఉన్న…

Read More
Congress-led protests in Sathupalli included rallies, idol purification, and burning of Amit Shah’s effigy over remarks against Dr. B.R. Ambedkar.

అంబేద్కర్ అవహేళనకు నిరసనగా సత్తుపల్లిలో ఆందోళన

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని పార్లమెంటులో అవహేళన చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన సభ ఏర్పాటు చేసి, అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి పూలమాలతో అలంకరించారు. నిరసనగా, అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ రింగ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం బస్టాండ్ రింగ్ సెంటర్లో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు….

Read More
CPM leaders criticized BJP for attempting to centralize power, targeting minorities, and promoting divisive politics during the 22nd district conference in Khammam.

బిజెపిపై తీవ్ర విమర్శలు చేసిన సిపిఎం నాయకులు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిపిఎం పార్టీ 22వ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ, బిజెపి జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్రలు పన్నుతోందని ఆక్షేపించారు. బిజెపి మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, మతతత్వ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటోందని విమర్శించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, బిజెపిని అడ్డుకునేందుకు కాంగ్రెస్…

Read More