కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బంది బస్సు ప్రమాదం, 20 మంది గాయాలు
కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందితో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నిర్మల్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా, ముందు వెళ్తున్న మరో బస్సును వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది సిబ్బంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న సిబ్బంది పెద్దగా కేకలు…
