
ఆర్టీసీ బస్సులో ప్రసవించిన గర్భిణి
గద్వాల జిల్లా నందిన్నే గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మరియమ్మకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్ దృష్టికి తీసుకెళ్లి బస్సును రోడ్డు పక్కన ఆపించారు. పురిటి నొప్పులు తీవ్రమయ్యాక సాటి మహిళా ప్రయాణికులు బస్సులోనే ఆమెకు సాయం చేసి పురుడు పోశారు. మహిళల సాయం వల్ల మరియమ్మకు సాధారణ ప్రసవం జరిగి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108…