Andesri Passed Away తెలంగాణ గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

Andesri Passed Away: తెలంగాణ గీత రచయిత అందెశ్రీ కన్నుమూత 

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ సాహితీవేత్త అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలోని తన నివాసంలో అకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడికి చేరుకునేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనతో సాహిత్య వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జనగాం సమీపంలోని రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు “అందె ఎల్లయ్య”. చిన్ననాటి నుంచే ఆయనకు కవిత్వం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉండేది. తన భావోద్వేగాలు,…

Read More
జనగామ జిల్లా ఓబుల్‌ కేశవపురం గ్రామంలో కుమ్మరి కులస్థులపై బహిష్కరణకు నిరసన తెలిపిన గ్రామస్తులు

జనగామలో కుల వివక్ష కలకలం – కుమ్మరి కులస్థులపై సామాజిక బహిష్కరణ

జనగామ మండలం ఓబుల్‌ కేశవపురం గ్రామంలో కుల వివక్షత మరోసారి తలెత్తింది. గ్రామంలోని కుమ్మరి కులస్థులను ఓసీ కులాలకు చెందిన వ్యక్తులు సామాజికంగా బహిష్కరించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. దళితులకు సహాయం చేశారనే కారణంతో కుమ్మరి కులానికి చెందిన వారిని గ్రామంలో వేరుచేసినట్లు సమాచారం. ఇటీవల గ్రామంలోని దళితుల వివాహాలకు కుండలు అందించినందుకు కుమ్మరి కులంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓసీ వర్గాలు, ఇకపై వారిని బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది. గ్రామంలో ఎవ్వరూ…

Read More
జనగామలో బ్రిడ్జిల నిర్మాణం కోరిన ఉద్యమకారులపై కేసులు నమోదు

జనగామలో బ్రిడ్జిల నిర్మాణం కోరిన ఉద్యమకారులపై కేసులు: ప్రభుత్వం ప్రజా స్వరం అణచివేతనా?

జనగామ జిల్లాలో ఇటీవల కురిసిన తుఫాన్ కారణంగా రహదారులు ధ్వంసం కావడంతో తక్షణమే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యమకారులపై కేసులు పెట్టార‌ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ స‌ర్కార్ దండుపాలెం ముఠా పాలన సాగిస్తుంద‌ని, రిమాండ్ కు తరలించిన ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఉద్యమకారులను పరామర్శించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా…

Read More
Ritika and Parvati from Jangaon district set an inspiring example by achieving 100% school attendance throughout the academic year.

100% హాజరుతో ఆదర్శంగా నిలిచిన అక్కాచెల్లెళ్లు

విద్యార్థులలో హాజరు శాతం తక్కువగా ఉండే పరిస్థితుల్లో జనగామ జిల్లా మాన్‌సింగ్ తండా గ్రామానికి చెందిన రితిక, పార్వతిలు అన్ని రోజులు బడికి హాజరై అందరికీ ఆదర్శంగా నిలిచారు. రితిక 3వ తరగతి, పార్వతి 4వ తరగతిలో చదువుతున్నారు. వీరిద్దరూ విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ 12వ తేదీ నుండి ముగిసే వరకూ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పాఠశాలకు హాజరయ్యారు. వారిద్దరూ కేవలం హాజరులోనే కాకుండా చదువులో కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. పరీక్షల్లో మెరుగైన…

Read More
Tragic incident in Janagama: Constable Neelima dies by suicide after repeated marriage rejections despite having a government job.

పెళ్లి కుదరక పోవడంతో కానిస్టేబుల్ నీలిమ ఆత్మహత్య

జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, పెళ్లి సంబంధాలు వరుసగా కుదరకపోవడంతో మనోవేదనకు గురైన ఓ మహిళా కానిస్టేబుల్ నీలిమ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. నీలిమ 2020లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికై శిక్షణను పూర్తి చేసిన తరువాత వరంగల్ కమిషనరేట్‌లో విధుల్లో చేరింది. ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూసినా అనేక కారణాలతో అవి కుదరలేదు. ఈ కారణంగా కొంతకాలం సంబంధాల వెతకడం…

Read More
Retirement Ceremony of Vadlakonda Village Secretary

వడ్లకోండ గ్రామ కార్యదర్శి పదవి విరమణ సన్మానం

జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలులో గ్రామాల అభివృద్ధి కార్యదర్శుల పాత్ర ఎంత కీలకమో స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు అచంచలంగా వాడవలసిన వాటిగా ఉన్నాయని, అందులో కీలకమైన భాగం గ్రామ కార్యదర్శులదేనని ఆయన అన్నారు. ఈ సందర్బంగా జనగామ మండలంలోని వడ్లకోండ గ్రామ కార్యదర్శి దోర్నాల మనోహర్ స్వామి పదవి విరమణ సన్మోనోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఉద్యోగికి పదవి విరమణ అనేది…

Read More
In Vadlakonda, Janagama, a Gram Sabha turned chaotic as locals questioned officials. Congress and BRS activists clashed, leading to police intervention.

జనగామలో ప్రజా పాలన గ్రామసభలో గందరగోళం

జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ సందర్భంగా గందరగోళం నెలకొంది. గ్రామస్థులు అధికారులను మరియు ప్రజా ప్రతినిధులను ప్రశ్నించగా, అక్కడ ఉద్రిక్తత పెరిగింది. తమ సమస్యలు పరిష్కరించలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం విమర్శించుకున్నారు. ఇరువర్గాల కార్యకర్తలు మాటామాటా పెంచుకుని ఘర్షణకు దిగారు. కొందరు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామ…

Read More