Telangana MLAs Disqualification:అనర్హత వేటు భయంతో రాజీనామా యోచనలో దానం, కడియం.?
Telangana MLAs Disqualification: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్(Dhanam Nagender), కడియం శ్రీహరి(Kadiyam Srihari) అనర్హత తప్పించుకునేందుకు ముందుగానే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చల కోసం దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు(Disqualification…
